బ్రతుకు భారం....

నా బ్రతుకే బతకడం అతి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ....
అఖండ భారత జనం కోసం బ్రతుకుతున్న అభ్యుదయ వాడిని నేను ... !
ఆలోచన తప్ప .... ఆచరణ సాధ్యం కాని నవయువ కవిని నేను.... 
భావి భారత భారాన్ని నేను ....!

ఈ రవి కాంతిలో తిరిగేంత  ధైర్యం లేదు,
చంద్రుడు కూడా లేని ఈ అమావాస్య చీకటిలో ఉండాలంటే భయంగా వుంది నేడు,
వెలుతురుకి ... చీకటికి .....
భయానికి ..... ధైర్యానికి ....  మధ్య వ్యత్యాసాన్ని వెతుక్కొనే పనిలో వున్నాన్నేను ....!


సగ జీవితం అదృష్ట దురదృష్టాల మధ్య అంతులేని దోబూచులాట
బాల్యంలో  భాద తెలియని బానిస బ్రతుకు నాకు తోడుగా ఉంది ...!

పుట్టుకతో పేదరికం అనే జన్యుసంబంధ వ్యాధితో భాద పడుతున్ననేను,
కష్టపడి డిగ్రీ పూర్తి చేసాక నిరుద్యోగం అనే అంటువ్యాధి కూడా సోకింది నాకు ....!


బ్రతకడానికి ప్రతి క్షణం చస్తున్నవాళ్ళం,
నేడు మీరు వచ్చి చంపేస్తాం అంటుంటే మీరు రాజకీయ నాయకులేనా అని సందేహం వస్తుంది


Comments

Popular Posts