కవితా..... ఓ కవితా......
కవితా..... ఓ కవితా......
కాలం నన్ను కాలగర్భంలో కలిపేస్తున్న సమయంలో నాతో ఉన్నది నువ్వేకదా...!
విధి నా ప్రతి ఊహని ఉరికంభం ఎక్కిస్తున్నప్పుడు నా తరఫున న్యాయం కోసం పోరాడింది నువ్వే కదా....!
నా ఈ గందరగోళ గుండె చప్పుళ్ల అంతరార్థం
అవగతం చేసుకున్న ఆత్మబంధువు నువ్వేకదా ....!
నిజం చెప్పు ..... నువ్వే కదా .....!
అలాంటి నీపై కవిత రాయకుండా .... ఎప్పుడు నన్ను పలకరించని వాటిపై అక్షరాల వర్షం కురిపిస్తున్నాను ?
ఈ రోజు నీపై నాకున్న అనిర్వచనీయమైన అభిమానాన్ని కవిత రూపంలో చెప్పేందుకు నేడు నా కలం ఉవ్విళ్లూరుతోంది ....!
నువ్వు నా అంతర్మధన ఆశాజ్యోతివి ....
నువ్వు నా ఎండమావిలో గుక్కెడు దప్పికవి .....
నువ్వు నా నిశీధిలో శశిరేఖవి ....
నువ్వు నాకు కలలో... ఇలలో తోడున్న ఒకే ఒక్క ప్రియసఖివి ....
అలాంటి నీకోసం ఈ నా కలాన్ని కదిలించకపోతే ఈ కలియుగంలో ఇంతకుమించి నేను చేసిన తప్పు ఇంకోటి ఉండదనిపిస్తుంది ..... !
కాలం ఉన్నపాటుగా ఆగిపోయిన మరు క్షణం నా భవిషత్తు నువ్వు
ప్రాణవాయువు దొరకని మరుక్షణం నేను నీలో విలీనం అవుతా
నీరెండలు ..... రాత్రిపవళ్ళు .... నింగినేలలు ..... నువ్వునేను ....
నువ్వునేను మాత్రమే .....
కవితా ...ఓ కవితా
నా రజని కాంత
ఓ అమావాస్య చంద్రిక .... నువ్వు నాకు మాత్రమే కనిపిస్తావు .... ఎందుకంటే నువ్వు నాసొంతం ...

Comments
Post a Comment