నేటి పౌర్ణమిలో చీకటి చూశాన్నేను

నిన్నటి నా గుండెచప్పుడులో గల గందరగోళం,
మొన్నటి నా కనుపాపల కదలికలో ఉన్న  అలజడి, అంతకముందు రోజు వర్షపు చినుకుల సవ్వడిలో నేను విన్న సంగీతం,
నాలుగు రోజుల క్రింద నా అడుగుల్లో వున్నా తడబాటు .... 

నేడు వినపడటం లేదు ..... 
మైక్రోస్కోపులో చూసిన కనిపించడాం లేదు నేడు .... 
అడుగు ముందుకు పడదు .... ఆశ చావదు .....!

తడబాటులో పడినా   ఆ అడుగులు ఆనందాన్నిచ్చాయి ఆ రోజు ..... 
నాకు స్వరాలు తెలియకున్నా ఆ చినుకుల శబ్దంలో వున్న సంగీతం గుండెకు హత్తుకుంది నాడు
ఆ కనుపాపల కదలికలో అలజడి నాకు ఆ క్షణం తోడుంది .... 
ఆ గుండెచప్పుడు గందరగోళంలో సైతం నా గమ్యం స్పష్టంగా వుండింది ....!


విరామమెరుగక నన్ను ఉత్తేజపరిచినవన్నీ  .... నేడు విసిగిస్తున్నాయి ....!
అనునిత్యం నాతొ వున్న వాస్తవాలు ..... నేడు ఉన్నపాటుగా గ్యాపకాలై పోయాయి 
ఈ రోజు భానుడి ఉదయపు కిరణాలలో అమావాస్య చీకటి చూసాను నేను ....!
నేటి భాస్కరుడి తెల్లవారు జాము అత్యంత చీకటిని ఇచ్చింది నాకు. 

ఇప్పుడర్థమైంది నాకు .....! 

నేను అదృష్టానికి అత్యంత దూరంలో ..... 
దురదృష్టానికి చాలా దగ్గరలో వున్నానని ..... 
నిన్నటి ఆశ నా అత్యాశ అని, 
మొన్న నామదిలోని భవనాలు ఒట్టి భావోద్వేగమని ,
నేటి సూర్యోదయంలో నేను కాంక్షించిన చీకటిలో అర్థమైంది నాకు .....,
నా గుండె చప్పుడు ఆగిందని .....!
నువ్వు ఇక ఒక జ్ఞ్యాపకం అని .....! 





(రెండవ అధ్యాయం ముగిసింది )





Comments

Popular Posts