ఆగష్టు 6 వ తేది... సమయం ఉదయం 7. 20 నిం

నేనెప్పుడూ అనుకోలేదు .... ఇలాంటి నక్షత్రాన్ని చూస్తానని....
నేను ఏనాడు కోరుకోలేదు ... ఇటువంటి తార ఎదురుపడాలని... 
నేను ప్రతిరోజూ చూసే ఆకాశంలో ఇలాంటి ఒక చుక్కానిని 
దాదాపు దశాబ్దపు కాలంముందు చూసాననిపిస్తుంది.... 

ఇదిగో మళ్ళీ ఇప్పుడు ....!

జరిగిన దానిని నేను ఊహించలేదు ....,
ఇలా జరగాలని నేను కోరుకోలేదు ...,
విధిని.... కాలాన్ని .... 
అదృష్టాన్ని ..... దురదృష్టాన్ని ఒక్కసారిగా నమ్మాలనిపిస్తుంది ... 
కనీసం వాటిని గౌరవించాలనివుంది....!

నా మదిని కప్పి ఉంచే కారు మేఘాలు ఎప్పుడూ వున్నవే అయినా .... 
ఏ ఒక్క మేఘంలో కూడా నా మదిని పులకింప చేసి, 
ఆలోచనలనే విత్తనాలని మొలకెత్తించి....,
కవితా కుసుమాలు పూయిన్చే వర్షపు చినుకులు లేవు .... !

అలాంటి ఈ మేఘాలు ఒకనాటి సాయంత్రం 
ఉన్నపాటుగా బరువెక్కాయి ... 
అంతులేని నీటిని దాచుకోవడానికి ప్రయత్నించాయి .... 
ఆకాశ విను వీధుల్లో పరుగుల పందెంలో పాల్గొన్నాయి... !


మనస్సు బరువెక్కినప్పుడు భాద పుడుతుందో ... లేదో ... నాకు తెలీదు కానీ .... 
మేఘాలు బరువెక్కినప్పుడు మాత్రం వర్షం కురవాలి .... అది ప్రకృతి తత్త్వం...!


ఆ రోజున అలుముకున్న మేఘాలు బరువెక్కడానికి.... అవి ఎడతెరిపి లేని వర్షాన్ని ఇవ్వడానికి ఒక నక్షతం కారణమంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు.... 
మొదట హాస్యం గాను..... కొద్దిసేపు తరువాత వెటకారంగాను ....
ఆ తరువాత ఆలోచింపచేసేదిగా ఉంది ....!

నా మనోనేత్రం వైపు చూసి .... నా హృదయ మేధస్సుని అడిగా ఒక సలహా ...?
నువ్వు చెప్పు మిత్రమా .....? ఈ వర్షానికి కారణం ఆ నక్షత్రమా ???
నా ప్రశ్న ఇంకా పూర్తికాకముందే .... హృదయాంతరాళం లోంచి ఒక శబ్దం ... 
అది వినడానికి సంగీతంలా ఉంది .... వెతికి పట్టుకుందామంటే ఒక్క స్వరమూ అర్థం కావడం లేదు. .... అయినప్పటికి అది చెప్పే భావం మాత్రం సుస్పష్టం .... 

ఈ నాటి ఈ మేఘాల బరువుకి ... 
అవి చేసే అలజడికి .... 
కురిపించే ఈ మధురానుభూతి వర్షానికి కారణం .... ఆ నక్షత్రమని .... 
ఆ నక్షత్రం మాత్రమేనని ..... !

ఇంత తక్కువ సమయంలో .... 
అంత  ఎక్కువ మొత్తంలో ..... 
ఈ మధ్య కాలంలో ..... 
ఇంతలా ఒక విషయం గురించి ఆలోచించిన అనుభవం లేదు.... అవసరం అంతకన్నా రాలేదు 

కాలం ... 
విధి ..... చాల గొప్పవి ....!
వరదల్ని నియంత్రించడానికి తుపానుని 
క్షామాన్ని  అధిగమించడానికి కరవుని తోడుగా పంపుతుంటాయి ...!


నైరుతి రుతు పవనాలు నాలుగు నెలల పాటు ఉంటాయి,
ఈశాన్య రుతు పవనాల కాలం రెండు నెలలు...., 
నా.... ఈ ..... ప్రేమ రుతు పవనాల కాలం 45 రోజులని ఇప్పుడర్థమైంది


నా డైరీలో మిగిలిపోయిన సగం పేజీలు ఈ యాబై రోజుల్లో పూర్తయ్యాయని అర్థమైంది ...!
కాలమా ...... నీకో శతకోటి వందనాలు .... 
విధి ..... నీకు నా జీవితకాల సలాములు .....!

























Comments

Popular Posts