నా మౌనం మేఘ సందేశం...

నా మౌనం మేఘ సందేశం
నా భావం వసంతగానం
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరానిదాహం...

నా ఆలోచన అలుపెరుగని పవనం
నా నిరీక్షణ తీరం లేని కెరటం...

నా మనస్సొక వేవేల ఆశల సంద్రం
ప్రతి ఆశ సాయంకాల సంధ్యాసమయం ...

ఈ గానం శ్రోతలేని ఒక శబ్దం
ఈ భాద సూణ్యంలో కాంతి ప్రయాణం ...

నా ప్రయాణం ఒక అంతరిక్షయాణం
ఆటుపోటులు  లేని గాఢాంధకారం ....

ఆశ .... ఆకాంక్ష .... ఆవేదనల కంటే
అవసరం నడిపిస్తున్న ఈ వేళ ....
ఒక సూర్యాస్త సమయం
ఒక పున్నమి చంద్రోదయం

Comments