తుపాను కావాలి

నాకొక తుపాను కావలి 
నాకొక తుపాను రావాలి 

నిరాశ, నిస్పృహలతో సావాసం చేస్తున్న ఈ జీవితంలో 
చలనం రావాలంటే నాకొక తుపాను కావలి ....!

భాద, భయం నా జన్మ హక్కులుగా మారకుండ
ఉండాలంటే ఈ జీవితానికో తుపాను రావాలి ....!

నా చేతకాని తనాన్ని..... నా దురదృష్టాన్ని .... 
ఒక్కపెట్టుగా తుడుచుకు పెట్టె ఒక "హుదూద్ " కావలి నాకు ....!

ఓటమి అనే వరిపంటని ఏడాదికి రెండు సార్లు పండిస్తున్న 
ఈ దయనీయమైన జీవిత వ్యవసాయం మారాలంటే  నాకొక "పైలిన్" కావలి....!


ఆ తుపాను బంగాళాఖాతంలో అల్పపీడనం వాళ్ళ వచ్చినా .... 
లానినో ప్రభావం వల్ల వచ్చినా ..... 
కొరియాలసిస్ ప్రభావం అయినా పరవాలేదు ....!

ఈ జీవిత గమనాన్ని మార్చి , నా గమ్యాన్ని చేర్చే 
ఒక "తొలకరి" ... ! కాదు ...... కాదు .....!
ఒక తుపాను కావలి నాకీరోజున .... !




(నాలో అలుముకున్న నిరాశవాదానికి ప్రతీక ఈ అక్షరాలు )


     - ప్రభానవీన్  

Comments

Popular Posts