ఈ నిరీక్షణ నాలో సగ భాగం

గడిచిన రాత్రి గాఢాంధకారాన్ని నువ్వు అనుభవించకపోతే 
నేటి ఉదయపు కాంతిరేఖల గొప్పదనం నీకు అర్థం కాదు .....!

మొన్నటి తన జ్ఞపకాల వాహనమెక్కి 
ఆకాశపు విను వీధుల రహదారులలో 
కాల్పనిక సాహిత్యపు కవిత అనే ఇంధనం నింపి 
హద్దులు లేని ..... అద్భుతమైన ...... సంబ్రమాశ్చర్యమైన 
అనంత ఊహల ప్రపంచానికి నేను వెళ్లకపోయుంటే .... 


నేటి వాస్తవం అవగతం అయ్యేది కాదు .... 
నేటి బాధలో వున్న భావోద్వేగం భోదపడేది కాదు .... 
ఈ నా మనస్సు విరహవేదన నన్ను వండించేది కాదు 
పై అక్షరాలకు నా కలం పురుడు పోసేది కాదు .....!

నా ఆశలు హద్దులు దాటి ఉండొచ్చు 
నా ఆలోచనలు అతిశయోక్తి కావొచ్చు 
నా కవిత కాల్పనికం అయివుండొచ్చు 
నా రాతలు ఊహా శశిరేఖలు అనిపించొచ్చు 
కానీ ...... నువ్వు నిజం .... 
నేను చూసిన నీ నవ్వు నిజం ..... 

ఈ నిరీక్షణ  నాలో సగభాగం .... 

Comments