దివ్యానుభూతి (నవల)

మరో వింత ప్రపంచాన్ని అత్యంత దగ్గరగా చూసిన రోజులు...!!!



                                ఈ ఏడాది వేసవి మే మాసం చివరి వారంలో  ప్రారంభమైన 2019  క్రికెట్టు ప్రపంచ కప్పు పోటీ చాలా రసవత్తరంగా సాగుతుంది.  ఇండియా లీగ్ పోటీలో  దక్షిణాఫ్రికా మీద గెలిచి తన ఖాతాలో మొదటి విజయాన్ని వేసుకొంది. రెండో విజయం కోసం సిద్దమవుతున్న తరుణం.... ఈ పోటీ ఆస్ట్రేలియాతో JUNE 09 న జరుగనుంది. ఆ రోజు ఆదివారం... మధ్యాహ్నం సమయంలో మ్యాచ్ ప్రారంభం అయిన్ది. ప్రపంచ కప్ లో భారత్ కి ఆస్ట్రేకియా కి మధ్య పోటీ అంటే ఎప్పుడూ  ఆసక్తిగానే ఉంటుంది.

                                   ఆ రోజు ఆదివారం... మధ్యాహ్నం సమయంలో మ్యాచ్ ప్రారంభం అయిన్ది. ప్రపంచ కప్ లో భారత్ కి ఆస్ట్రేకియా కి మధ్య పోటీ అంటే ఎప్పుడూ  ఆసక్తిగానే ఉంటుంది.  ఆ రోజు సాయంత్రం సమయం దాదాపు 5 గంటలు కావొస్తుంది.  తను చదువుతున్న గ్రంధాలయం వరండాలో వున్న కూర్చి మీద చాలా ప్రశాంతంగా ఆసీనుడై క్రికెట్టును చూస్తున్నాడు సిద్దు. మొత్తం ద్రుష్టి అంత దాని మీదనే వుంది అతనికి. తన ముందు నుంచి ఎవరు వెళ్తున్నారో కూడా తను పట్టించుకోవడం లేదు. అలా  ఎవరో ఒకరు తన ముందు నుంచి వెళ్లిపోయారు అదే సమయంలో. వెళ్లిన వ్యక్తి అమ్మాయి అని తను గమనించాడు అటు వైపు చూడకుండానే. ఆసలే కొంచెం బిడియంతో కూడుకున్న వ్యక్తిత్వం తనది. అందులోను వెళ్ళినది ఒక అమ్మాయి. మరి ముఖ్యంగ భారత్ బ్యాటింగ్ చేస్తుంది ఆ సమయంలో. కాబట్టి తను అటువైపు చూడలేదు.


ఆ అమ్మాయి వెల్లిపోయింది దాదాపుగా....

ఇంతలో EXCUSE  ME ... అని ఒక పిలుపు వినిపించింది.

ఇక్కడ దగ్గరలో కాఫీ షాప్ ఏమన్నా ఉందా ?
సిద్దు: haa ... ఉంది. అని చెప్పి directions  చెప్పాడు.
తనకి అర్థమైందో లేదో అని చెప్పి మల్లి చెప్పిందే మరో సారి  చెప్పాడు.
తను సరే అని చెప్పి.... thank you చెప్పి వెళ్ళిపొయిన్ది. సిద్దు కూడా క్రికెట్ మ్యాచ్ లో లీనమైపోయాడు.

అక్కడకి రెండు నిముషాలు తరువాత సిద్ధుకి మల్లి ఆ అమ్మాయి గురుతొచ్చింది. "అరే  బలేఉంది ఈ అమ్మాయి. మరొక్కసారి కనిపిస్తే బాగున్ను" ఇది తన మనుసులో అనుకున్న విషయం.

నిజానికి చాలా రోజుల తరువాత ఒక అమ్మాయిని చూస్తే అలా అనిపించడం సిద్ధుకి ఆశ్చర్యం అనిపించింది.
BUT .... "She  is  GORGEOUS."

నిజంగానే అనుకున్నట్టుగానే తను  పది నిమిషాలతరువాత వచ్చింది. కానీ ఇంతలో సిద్దు లైబ్రరీ ఫ్రెండ్ వచ్చి వాడి పక్కన కూర్చొని ఏవేవో సందర్భం లేని సోది మాటలు చెబుతూ విసిగిస్తున్నాడు. తన ఏకాంత సమయం పోయిన్దని  సిద్దు భాద పడుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో తను వచ్చింది. సిద్దు ముందు నుంచి నడుచుకుంటూ వాడితో మాట్లాడాలా లేక వెళ్లిపోవాలా అనే ఒక గందరగోళంలో ముందుకు అడుగులు వేస్తున్నట్టు వెళ్లడం సిద్దు గమనించి తను దాదాపు దాటిపోయిన్దన్న సమయంలో సిద్దు మాట్లాడాడు.

సిద్దు : COFFEE షాప్ తీసారా?
వెన్నెల: haa .... తీశారు. (సిద్దుకి తన పేరు తెలీదు. కానీ తన మాటలు  రాయడం కోసం ముందుగానే ఆ అమ్మాయి పేరు రాస్తున్నాను.)
సిద్దు : okay, అంటే ఈరోజు ఆదివారం కదా.... ఒక్కోసారి తీయరు. మీకు చెప్పినప్పుడు నాకు ఆ విషయం గురుతులేదు. మీరు వెళ్ళిపోయాక గురుతొచ్చింది. అందుకే అడుగుతున్నా?
వెన్నెల: ఓ .... తీశారు. thank  you.

                                అని చెప్పి తాను వెల్లిపొయిన్ది. సిద్దు తను  కోరుకున్నట్టు ఆ అమ్మాయి మల్లీ కనిపించడం చాల సంతోషంగా వున్నాడు.
                                లైబ్రరీలో ఇంతకముందు తనని ఎప్పుడు సిద్దు చూడలేదు. తను కొత్తగా చేరిందా? ఒకవేళ చేరితే తను ఏ అంతస్తులో చదువుతుంది. ఒకవేళ సిద్దు తను చదువుతున్న అంతస్తులోనే ఐతే ఏ రూమ్? ఇలా వరుసగా తన మనసులో ప్రశ్నల పరంపర కొనసాగుతుంది. ఇంతలో తను బుక్స్ పట్టుకొని పైకి వెళ్ళింది. ఈరోజు మొదటి అంతస్తులో కరెంటు పొయిన్ది. రెండో అంతస్తుకెళ్లి చదువుకోమని లైబ్రేరియన్ చెప్పాడు. కాబట్టి తను పైకి వెళ్లిందా? లేక రెండో అంతస్తులోని చేరిందా అనేది ప్రశ్న? కొద్దిసేపు అయ్యాక సిద్దు బుక్ తీసుకొని పైకి వెళ్ళాడు. చదువుకుందామని వెళ్ళాడు అని చెబితే కచ్చితంగా అబద్దం అవుతుంది. తనని మరో సరి చూడాలని అనుకోని వెళ్ళాడు. SHE IS THERE. తను లోపలికి వెళ్లిన వెంటనే వెన్నెల ఒక  చివర  కూర్చొని తనని చూసింది. సిద్దు ఆనందానికి  ఈ సారి అవదులు లేవు. అక్కడే కూర్చొని చదువుదామని ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు. తన ప్రశ్నలకి కూడా సమాధానాలు దొరకడం లేదు. తను  అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.







Comments

Popular Posts