అణువణువూ స్ఫూర్తిగా ....
నిన్ను నేను చూసి ఉండకపోతే
బహుశా నేను నాస్తికుడ్ని అయ్యేవాడిని! నా దేవత నీవే కాబట్టి...
నీవు నా చేయి పెట్టుకోకపోతే
బహుశా నేను వికలాంగుడిని అయ్యేవాడిని! నాకు నడక నేర్పింది నీవే కదా.....
నీ మాటలు నాకు వినిపించకుంటే
నేను మూగవాడిని అయ్యేవాడినేమో! నాకు మాటలు నేర్పింది నీవే కదా ....
నీ కనుచూపు నాపై ప్రసరించకుంటే
నేను అంధుడ్ని అయ్యేవాడినేమో ! నాకీ ప్రపంచాన్ని పరిచయం చేసింది నేవే కదా ....
నీ స్పర్శ నన్ను తాకకుంటే
అసలు నేను మనిషినై ఉండేవాడిని కాదు! నాలో మానవత్వాన్ని నింపింది నీవే కదా .....
నీ పాదాల్ని నేను తాకినా .....
నా రెండు చేతులు నీ కాళ్ళ ముందు జోడించినా ....
నీ పాదాల్ని నేను ముద్దాడలేదే అనే తీవ్రవధ మనసుని వెంటాడుతుంది ప్రతిక్షణం....
నువ్వు లేని జీవితం "శబ్దం లేని సముద్ర కెరటాల్లా.....
ఆహ్లాదం లేని పున్నమి చంద్రుడి వెలుగులా ఉందమ్మా.... "
నీవు నన్ను వదిలి వెళ్లావనే భాద కన్నా ....
నీ ఋణం తీర్చుకొనే అవకాశం రాకముందే
నన్ను విడిచి పెట్టావని దుఃఖంగా ఉందమ్మా ....
ఒక్కసారి కనిపించవా .... ? నీ పాదాలను ముద్దాడుతా .....
అమ్మమ్మ గురుతుగా రాసిన నా గోడు కవిత ..... ప్రభానవీన్
Comments
Post a Comment