భూమి కావాలి

మైనింగ్ లో మామిడి తోట పోయిన్ది ...... పూత నిండుగా వున్నా కాయలు ఇక రాలవు.....
ఎందుకని అడిగితే తోట అభివృద్ధిలో భాగమైనది అంది ప్రభుత్వం.....

నిన్న ఈ రహదారి పక్కన వున్న పెద్ద రావి చెట్టు నేడు కనుమరుగయినది ..... 
ఏమైనదని అడిగితే  అభివృద్ధిలో భాగమైనదని అన్నారు ...... 

మొన్న ప్రశాంతంగా వున్న పొలం నేడు ప్రొక్లైన్ల ఘర్జన్లకి లారీల పరుగుపందేలకి వేదికయిన్ది..... 
ఎందుకని అడిగితే  విమానాశ్రయ అభివృద్ధిలో భాగమైందన్నారు ...... 

నేటివరకు పల్లెలో వున్న నా ఇల్లు రేపు పట్టణంలో ఫ్లాటు అవుతుందన్నారు.....
ఏవిధంగా అని అడిగాను ....... ఇక్కడ  రాజధాని నిర్మిస్తాం అన్నారు గంభీరంగా ..... 

 నేనెప్పుడూ వినని మాటలు వినిపిస్తున్నాయ్  తరచూ వినబడే మాటకు తోడుగా ..... 
అదే అభివృద్ధికి భూమి కావాలి, రాజధానికి భూమి కావాలి అనీ ...... 

నా బ్రతుకును అతి భారంగా ఈడ్చే ఈ నేలను ఇవ్వలేనన్నాను దీనంగా.... 
వప్పుకుంటే భూ సమీకరణ అన్నారు, లేకుంటే భూ సేకరణ  అంటున్నారు.....
నా మట్టిని తీసుకోవడం తధ్యం అని అర్థమైంది నా మనసుకి నిధానంగా ..... 
బహుశా అభివృద్ధి అంటే ఇదేనేమో........ 

పాఠశాలకు వెళ్లే పసిపిల్లాడు అడిగాడు అభివృద్ధి అంటే ఏమిటమ్మా అని ?
వాడి తల్లి చెప్పింది కన్నీటి జడితో ...... 
"అభివృద్ధి అంటే భూమి బలవంతంగా లాక్కోవడం అనీ ...... 
అభివృద్ధి అంటే అడుక్కుతినడం అనీ ..... "


 (నేను రాసిన నా గోడు  కవితల్లో ఇది ఒకటి ...... వర్తమాన సంఘటనలకి నా స్పందన ఈ కవిత)

ప్రభానవీన్ ...... 


Comments

Popular Posts